ఓటు వేసిన ప్రధాని, సోనియా, ప్రణబ్‌

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌లో ప్రధాని  మన్మోహన్‌సింగ్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్‌ భవనంలోని రూం.నెం 63లో ప్రధాని ఓటు వేశారు. అనంతరం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, యూపీఏ రాష్ట్రపతి  అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ పలువురు కేంద్ర మంత్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.