ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్లు

వరంగల్ బ్యూరో, నవంబర్30 (జనం సాక్షి)

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గురువారం వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఓటు వేసి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్లు ప్రజలను కోరారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రకాల ఏర్పాట్లతో ముందుకు సాగుతున్నట్లు వారు వివరించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు ఓటరుకు ఆయుధమని వారు పేర్కొన్నారు.