ఓయూలో భాష్ప వాయు ప్రయోగం

హైదరాబాద్‌: మార్చ్‌కు ర్యాలీగా బయల్దేరిన ఓయూ విద్యార్థులపై పోలీసులు భాష్పవాయు ప్రయోగం జరిపారు. భాష్పవాయు ప్రయోగం జరువుతూనే విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. పలువురి విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్‌సీసీ గేటు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఓయూ జేఏసీ నేతలు ధ్వజమెత్తారు. తాము ఎలాంటి హింసకు పాల్పడమని చెప్పినా కూడా తమను  నెక్లెస్‌ రోడ్డుకు వెళ్లేందుకు అనుమతించడం లేదని వాపోతున్నారు. మార్చ్‌కు అనుమతిచ్చి ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనలకు తెలంగాణ మంత్రులే బాధ్యత వహించాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు.