కంటివెలుగుతో జబ్బులను నయం చేసుకోండి

రైతులతో కలసి వరినాట్లు వేసిన మంత్రి

కొల్లాపూర్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): రైతులకు ఎన్నో విధాలుగా అండగా నిలిచిన సిఎం కెసిఆర్‌ ఇప్పుడు ప్రజలకు కంటి వైద్యం కోసం శ్రమిస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కంటివెలుగుతో ప్రజలు తమ కళ్లను పరీక్ష చేయించుకుని, జబ్బులుంటే చికిత్స చేయించుకోవాలన్నారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. పలు గ్రామాల్లో కంటి వెలుగు, రైతు భీమా పత్రాల పంపిణీపై మంత్రి సవిూక్ష నిర్వహించారు. గ్రామాలలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాలను సందర్శించి ప్రజలతో ముచ్చటించి, వారి అభిప్రాయం తెలుసుకున్నారు. అనంతరం సింగపట్నం చెరువు కింద వరినాట్లు వేస్తున్న వారితో కలిసి మంత్రి ఉత్సాహంగా నాట్లు వేశారు.