‘కటకం’పై చర్య తీసుకోండి..

– ఖబ్రస్థాన్‌ కబ్జా వ్యవహారంపై రాష్ట్రస్థాయిలో ఫిర్యాదు
– ముఖ్య నాయకులను కలిసిన గంభీరావుపేట ముస్లింలు
హైదరాబాద్‌, జూలై 18 (జనంసాక్షి):కరీంనగర్‌ జిల్లాకు చెందిన ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం గంభీరావు పేట లో ముస్లిం శ్మశాన వాటికను కబ్జా చేసి, అక్కడ ఉన్న నిజాం కాలం నాటి సమాధులను తన కొడుకులతో కలిసి కూల్చారని ఆరోపిస్తూ గంభీ రావుపేట మండల ముస్లింలు బుధవారం పలు వురు రాష్ట్రస్థాయి నాయకులను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు కటకం కబ్జా వ్యవ హారంపై తమతో కలిసి పోరాడాలని ఎంఐఎం సీనియర్‌ నాయకుడు, కార్వాన్‌ ఎమ్మెల్యే అహ్మద్‌ పాషా ఖాద్రిని కలిసి వినతిపత్రం ఇచ్చా రు. అదే విధంగా ఈ విషయాన్ని వక్ఫ్‌బోర్డు దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆ తర్వాత గాంధీ భవన్‌లో పీసీసీ రాష్ట్రస్థాయి మైనార్టీల సమావేశం జరుగుతున్నదని అక్కడికి వెళ్లి, సమావేశంలో పాల్గొన్న మంత్రి అహ్మదుల్లా, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీకి విష యాన్ని తెలిపి, మంత్రికి విన తిపత్రం ఇచ్చారు. ఈ సంద ర్భంగా వారు మాట్లా డుతూ కాంగ్రెస్‌కు మృత్యుం జయం కావాలో, ముస్లింలు ముస్లింలు కావాలో తేల్చుకోవాలని స్పష్టం చేశారు. మైనార్టీలకు అది చేస్తాం, ఇది చేస్తాం చెప్పకుండా, అన్యాక్రాంతమవుతున్న ముస్లింల చారిత్రక ప్రదేశాలు, అస్థిత్వం, ఆస్తులను కాపాడాలని కోరారు. కటకం ఆక్రమించిన స్థలంలో ముస్లిం శ్మశానానికి సంబంధించిన ఆనవాళ్లుగా సమాధులున్నా, ఈ విషయాన్ని రుజువు చేస్తూ తాము నిరసన కార్యక్రమాలు చేపట్టినా ఎవరూ స్పందించడం లేదని ఆరోపించారు. తమ మండల తహసిల్దార్‌ మృత్యుంజయానికి వత్తాసు పలుకుతూ జిల్లా కలెక్టర్‌కు తప్పుడు నివేదికలు పంపాడని వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రస్థాయి మైనార్టీ నాయకులు తమ గంభీరావుపేటకు రావాలని, కావాల్సిన ఆధారాలు చూపి సదరు కాంగ్రెస్‌ నాయకుడి కబ్జా తీరును చూపిస్తామని వెల్లడించారు. ముస్లింల శ్మశాన వాటికను కబ్జా చేసిన మృత్యుంజయాన్ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని కాంగ్రెస్‌ అధిష్టానాన్ని గంభీరావుపేట ముస్లింలు డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌కు వెళ్లిన వారిలో ఇబాదుల్లాఖాన్‌, సయ్యద్‌ జంషీద్‌ అలీ, మహ్మద్‌ అహ్మద్‌, సయ్యద్‌ జుబేర్‌, అబ్దుల్‌ రహీం, ఎం.ఎ.వహీద్‌, సాదిఖ్‌, యాసీన్‌, విలాయత్‌, సయ్యద్‌ ఖుతూబ్‌, ఖుతూబ్‌ తదితరులు ఉన్నారు.