కట్టే బోయిన రాములు ఆశయాలను సాధించాలి… * వర్ధంతి సభలో జూలకంటి..

మిర్యాలగూడ. జనం సాక్షి.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు కట్టే బోయిన రాములు ఆశయాలను సాధించాలని మాజీ ఎమ్మెల్యే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి కోరారు ఆదివారం నందిపాడు బైపాస్ వద్ద ఆయన స్థూపం వద్ద వర్ధంతి సభ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో రాములు కీలకపాత్ర పోషించారన్నారు. పోరాటం బలోపేతం చేసేందుకు ఆయన ఎంతో శ్రమించారన్నారు. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారన్నారు. పార్టీ నిర్మాణానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా నాయకులు డా. మల్లు గౌతమ్ రెడ్డి, నూకల జగదీష్ చంద్ర, రాగిరెడ్డి మంగా రెడ్డి,    రేమిడాల పరుశురాములు, ఆయూబ్, దేశిరాం నాయక్, రాంచంద్రు, సత్యనారాయణ రావు, వేములపల్లి వైస్ ఎంపిపి   పాదురి గోవర్ధన, వరలక్మి, మాధవ రెడ్డి,ఏసుబాబు, పాపారావు, వెంకట్ రెడ్డి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు