పోచంపాడ్ బాలికల గురుకులంలో లైంగిక వేధింపులు
నిజామాబాద్ (జనంసాక్షి) : నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ బాలికల గురుకుల పాఠశాలలో దారుణ విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో ఇద్దరమ్మాయిలు మ తిచెందిన విషయం భయాందోళనకు గురిచేయగా.. తాజాగా ఓ బాలిక తాను చనిపోతానంటూ తల్లిదండ్రులకు లేఖ రాసింది. ఆ పాఠశాలలో ఎలక్ట్రిషియన్‌గా పనిచేసే ఓ వ్యక్తి బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమేగాక, హాస్టల్‌లో వారు బాత్‌రూం వెళ్లి సమయంలో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు వెలుగులోకొచ్చింది. ఈ విషయం తన తల్లిదండ్రులకు ఆలస్యంగా తెలియజేసిన ఓ బాధితురాలు.. ప్రతినిత్యం నరకయాతన అనుభవిస్తున్నట్టు తెలుస్తోంది. జరిగిన విషయాన్ని బాధితురాలి తల్లిదండ్రులు తరగతి టీచర్‌కు తెలియజేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో పదేపదే లైంగిక వేధింపుల చర్యలు పునరావ తమవుతున్నాయి. బాధితురాలిని భయాందోళనకు కూడా గురిచేస్తున్నట్టు తెలిసింది.
వివరాల్లోకెళ్తే.. గత పదిరోజుల క్రితం పదో తరగతి బాలిక స్నానానికి వెళ్లిన సమయంలో ఎలక్ట్రిషియన్ ఆమెను వెంబడించాడు. లైట్లు ఆన్ ఆఫ్ చెక్ చేయాలనే పేరుతో బాలికను పిలిచాడు. ఆమెపై రెండు చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు కొన్ని రోజుల తర్వాత ఇంటికి వెళ్లిన సమయంలో తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వారు టీచర్‌కు తెలియజేశారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని, ఎవరికీ చెప్పొద్దని సదరు టీచర్ చెప్పినట్టు తల్లిదండ్రులు తెలిపారు. అయినప్పటికీ ఆ హాస్టల్‌లో ఉండలేనంటూ బాధితురాలు ఏడ్చినా.. పదో తరగతి పరీక్షలున్నాయని కన్నవాళ్లు సర్దిచెప్పారు. ఆ తర్వాత నిందితుడు బాలికను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్టు తెలిసింది. దీంతో ఆ అమ్మాయి ‘తాను భవనంపైనుంచి దూకి చనిపోతా’నంటూ తల్లిదండ్రులకు లేఖ రాయడంతో హుటాహుటిన వారు హాస్టల్‌కు చేరుకున్నారు. టీచర్లను సంప్రదించినప్పటికీ విషయం బయటకు చెప్పకండి.. సమస్యను పరిష్కరిస్తాం, అతన్ని మందలిస్తాం అంటూ దాటవేశారు. బాధితురాలి తండ్రి స్థానిక సర్పంచ్, స్థానికులకు విషయం తెలియజేశాడు. హాస్టల్‌లో ఎలక్ట్రిషియన్‌గా పనిచేసే నిందితుడి చర్యలకు విద్యార్థినులు ఆందోళనకు గురవుతున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే భయభ్రాంతులకు గురిచేస్తుండటంతో పిల్లలకు హాస్టల్‌లో ఉండేందుకు ససేమీరా అంటున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై టీచర్లు కూడా వెంటనే స్పందించడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు.



