కష్టం జీవులకు సుఖజీవన ప్రయాణం

 

 

 

 

 

 

30 ఏళ్ల కల సహకారమైన వేళ.
బషీరాబాద్‌లో హుబ్లీ ట్రైన్ నిలుపుదల సంతోషకరం.
ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.
తాండూరు ఫిబ్రవరి 27(జనంసాక్షి) కష్టజీవులకు సుఖ జీవన ప్రయాణం కోసం హుబ్లీ రైలును బషీరాబాద్ లో నిలపడం సంతోషకరమని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.శుక్రవారం తాండూరు నియోజకవర్గంలో ని బషీరాబాద్ మండలంలో నవాంద్గీ రైల్వే స్టేషన్ లో హుబ్లీ ట్రైన్ నిలుపుదల కార్యక్రమంలో భాగంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వల్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడి పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నిర్ణయం చాలా సంతోషకరమైన విషయమన్నారు.గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడి నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు మరియు స్థానిక ప్రజలందరి చిరకాల కోరిక హుబ్లీ ట్రైన్ బషీరాబాద్ లో నిలువాలని ఉండేదని నేటితో ఆ కోరిక నేరవేరిందన్నారు.తెలంగాణలోనే మారుమూల ప్రాంతంగా, కర్ణాటక సరిహద్దుకు ఆనుకుని ఉన్న బషీరాబాద్ మండల ప్రజలకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఇక్కడి ప్రజలు ఎక్కువగా తమ కష్టం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ముఖ్యంగా బషీరాబాద్ మరియు పరిసర గ్రామాల ప్రజలు రాష్ట్ర రాజధాని హైదరబాద్ వెళ్లేందుకు ఇబ్బందులు ఉండేవి,ఇప్పుడు హుబ్లీ ట్రైన్ నిలుపుదలతో ప్రయాణికులకు సౌకర్యం పెరగడంతో పాటు సమయం మరియు ఖర్చు కూడా ఆదా అవుతుంది.
ఈ రైలు నిలిపివేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికీ తెలుసుకెళ్ళీ ప్రత్యేకంగా ప్రయత్నాలు చేశాను. అలాగే ఈ విషయాన్ని కేంద్ర స్థాయిలో ముందుకు తీసుకెళ్లిన స్థానిక ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలుహుబ్లీ ట్రైన్ నిలుపుదలతో బషీరాబాద్ ప్రాంతం అభివృద్ధి దిశగా మరో ముందడుగు వేసిందని చెప్పవచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలకు ప్రయాణికులకు,రవాణా భారం తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వేంకటేష్ మహారాజ్, మర్కేట్ కమిటీ చైర్మన్ మాధవ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ శంకర్ రెడ్డి, మాజీ డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్,మాజీ జడ్పీటీసీ రాకేస్ మహారాజ్,సొసైటి మాజీ చైర్మన్ వెంకట్ రాం రెడ్డి,సొసైటి మాజీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసద్,మాజీ మర్కేట్ కమిటీ చైర్మన్ రాములు నాయక్, బాల్ రెడ్డి, పలు గ్రామల సర్పంచ్లు నాయకులు పాల్గొన్నారు..