కడపజిల్లాను చేర్చాల్సిందే

కడప, ఆగస్టు 3 : జిల్లా చారిత్రాత్మకతను, కళా వైభవాన్ని నలుదిశలా వ్యాపింపజేసేందుకు జిల్లాలో పర్యాటక ఉత్సవాలు నిర్వహించాలని పలువురు డిమాండు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక ఉత్సవాలలో కడప జిల్లాను చేర్చకపోవడం దురదృష్టకరమని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ జాబితాలో కడప జిల్లాను చేర్చకపోతే ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమవుతుందని జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు వివేకానందరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా మంత్రులు కూడా ఈ విషయంలో నోరు మెదపకపోవడం దురదృష్టకరమని చెప్పారు. జిల్లా మంత్రులు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.