కడవేరుగులో వంతెన నిర్మాణం చేపట్టాలి
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పాలనాధికారికి వినతి
చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 23 : చేర్యాల మండలంలోని కడవెరుగు గ్రామ మత్తడి వద్ద వంతెన నిర్మాణం చేపట్టాలని సిద్దిపేట జిల్లా పరిపాలన అధికారి అబ్దుల్ రెహమాన్ కు సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి కొంగరి వెంకట్ మావో మాట్లాడుతూ.. గత నాలుగు సంవత్సరాలుగా నాగపురి శభాష్ గూడెం వట్టిపల్లి మునిగడప నాగపురి పోతిరెడ్డిపల్లి రాజుపేట ఐనాపూర్ జగదేవ్పూర్ గజ్వేల్ కొండపోచమ్మ పోయే ప్రయాణికులు గత నాలుగు సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అనేక వాహనాలు చెడిపోయాయన్నారు. ప్రమాదాలు జరిగుతున్న సంఘటనలు ఉన్నాయని, ప్రయాణికులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సిపిఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని, ఇకనైనా వంతెనకు సరిపడ నిధులు మంజూరు చేసి వెంటనే వంతెన నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యుడు కత్తుల భాస్కర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, కత్తుల నరసింహారెడ్డి, జింకల బాలమల్లు తదితరులు పాల్గొన్నారు.
Attachments area