కప్పు కొట్టిన కరీబియన్లు

కొలంబో: టీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్‌ చరిత్ర సృష్టించింది..ఆతిధ్య లంకను చిత్తు చేసి వరల్డ్‌కప్‌ ఒడిసిపట్టింది..ఈ రోజు కొలంబోలో జరిగిన వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ శ్రీలంకపై 36 పరుగుల తేడాతో విజయం సాధించింది..తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ లంక బౌలర్ల ధాటికి గడగడలాడింది..లంక బ్యాట్స్‌మెన్‌ సామ్యూల్స్‌ విజృంభించడంతో 78 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో 137 పరుగులు చేసింది..అయితే 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది..విండీస్‌ బౌలర్లు విజృంభించడంతో లంక ఏదశలోనూ కోలుకోలేదు..విండీస్‌ బౌలర్లు నరినే మూడు వికెట్లు, సామీ 2 వికెట్లు పడగొట్టడంతో లంక 18.4 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది..దీంతో విండీస్‌ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. 33 సంవత్సరాల తర్వాత విండీస్‌కు ఇదే తొలి వరల్డ్‌కప్‌.