కబర్స్తాన్ లో త్వరలోనే లైటింగ్ ఏర్పాటు – మంథని మున్సిపల్ వైస్ చైర్మన్ అరెపల్లి కుమార్ మంథని,
జనం సాక్షి: మంథని మున్సిపల్ పరిధిలోని ముస్లిం మైనార్టీలకు చెందిన కబరిస్తాన్లో త్వరలోనే లైటింగ్ ఏర్పాట్లను పూర్తి చేస్తామని మంథని మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమార్ తెలిపారు. శుక్రవారం కబరిస్తాను ముస్లిం మైనార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. కబరిస్తాన్లో పలు అభివృద్ధి పనులు చేయాలని పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మధుకర్ ,మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజలను ముస్లిం మైనార్టీ నాయకులు కోరగా వారి ఆదేశాల మేరకు వైస్ చైర్మన్ ఆరపేల్లి కుమార్ పనులను పరిశీలించారు. కబరస్థాన్లో కరెంటు స్తంభాలను ఏర్పాటు చేసి నాలుగైదు రోజుల్లోనే విద్యుత్ కాంతులను అందిస్తామన్నారు. ఇతర సమస్యలను సైతం పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ అధ్యక్షులు ఎండి ఫయాజ్, ఉపాధ్యక్షులు కాజా మొయినుద్దీన్, మైనార్టీ నాయకులు సభ్యులు పాల్గొన్నారు.