కమీషన్లు రావని పేదలకు ఇళ్లు కట్టలేదు
` రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారు
` కాళేశ్వరంతో లక్షకోట్లు కూడగట్టారు
` సొంతింటి కల.. పేదవాడి చిరకాల కోరిక
` అర్హులైన లబ్దిదారులకు విడతల వారీగా ఇందిరమ్మ ఇండ్లు
` మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
మహబూబ్‌నగర్ బ్యూరో (జనంసాక్షి):మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార,పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి,రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు,రాష్ట్ర పశు సంవర్థక,డైరీ అభివృద్ధి, మత్స్య,క్రీడలు,యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీ హరిలి అర్హులైన ప్రతి పేద వారికి స్వంత ఇంటి కల నెరవేర్చేలా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర,సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.శనివారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం లో మూసా పేట మండల కేంద్రం లో ఉప్పరిపల్లి ప్రమీల ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమం లో మంత్రులు పాల్గొని గృహ ప్రవేశం చేసి శిలా ఫలకం ఆవిష్కరణ చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సభ లో మంత్రులు మాట్లాడారు.రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ,సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి లిపొంగులేటి శ్రీనివాస రెడ్డిలి మాట్లాడుతూ స్వంత ఇంటి నిర్మాణం పేదోడి ఆత్మ గౌరవం,భరోసా,ధైర్యం అన్నారు.ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్త శుద్ధితో పేద వారి చిరకాల కోరిక చిన్న ఇల్లు నెరవేర్చే దిశగా ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్రంలో మొదటి విడత 4 లక్షల 50 వేల ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు..ప్రతి నియోజక వర్గానికి 3500 ఇండ్ల చొప్పున మంజూరు చేసినట్లు ఇండ్ల నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు.దేవరకద్ర నియోజకవర్గం లో 3500 ఇండ్లు మంజూరు చేసినట్లు, 1900 ఇండ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నట్లు,100 నుండి 120 ఇండ్లు పూర్తి కావచ్చినట్లు చేప్పారు
ఇండ్లు పూర్తి చేసుకున్న మహిళలు సంతోషంగా ఉన్నారని,వారికి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని చేప్పారు.గత ప్రభుత్వం 10 సంవత్సరం కాలంలో లక్ష నుండి లక్షా 50 వేల ఇండ్లు నిర్మించినా 10 లక్షల ఇండ్లు పూర్తి అయ్యేవని, కాని 10 సంవత్సరం లలో 94 వేలు ఇండ్లు నిర్మాణం కు టెండర్ లు పిలిచి 74 వేలు మాత్రమే పూర్తి చేసారని,వాటిని పూర్తి చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అదనంగా నియోజక వర్గానికి 3,500 ఇండ్లు నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు.ఇచ్చిన మాట ప్రకారం 3 విడతలుగా ఇండ్లు మంజూరు చేసి ప్రతి పేద వాడికి మంజూరు చేస్తామని తెలిపారు. కులం తో,పార్టీ తో సంబంధం లేకుండా ఓటు కోసం కాకుండా ప్రతి పేదవాడి చిరకాల కోరిక తీరుస్తామని అన్నారు. ఏప్రిల్ నెలలో రెండో విడత ఇండ్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడిరచారు. ఇండ్లు నిర్మాణం దశలను అనుసరించి 5 లక్షలు రూ.లు దశల వారీగా ప్రతి సోమవారం డబ్బులు లబ్ధిదారునికి చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు.పునాది వరకు నిర్మించుకున్న ఇండ్లకు ఇందిరమ్మ మంజూరు క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.గత ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖను భ్రష్టు పట్టించారని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా అవినీతి లేకుండా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు నుండి పూర్తి చేసుకునే వరకు డబ్బులు దశల వారీగా చెల్లించే వరకు ముఖ్యమంత్రి సూచనల మేరకు అధికారులు అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఎన్నికల ముందు చెప్పిన విధంగానే ధరణి ని బంగాళాఖాతంలో వేసినట్లు, భూభారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు గ్రామ పాలనాధికారుల నియామకం చేసినట్లు, దసరా నాటికి లైసెన్స్ సర్వేయర్లను నియమకం చేయనున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. భూములకు భద్రత కల్పించేలా భూభారతి చట్టాన్ని తీర్చిదిద్దామని ఆయన తెలిపారు.ప్రజల ఆశలు, ఆలోచనలు అనుగుణంగా పేదోడి కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన అన్నారు.దేవరకద్ర నియోజకవర్గంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని వీలైనంత త్వరలో మంజూరు చేస్తానని అదేవిధంగా తహశీల్దార్ కార్యాలయం భవనాలను త్వరలో మంజూరు చేసి శంకుస్థాపనకు వస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు .రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి లిజూపల్లి కృష్ణారావులి మాట్లాడుతూ తరతరాలుగా తాతల కాలం నుండి ఇండ్లు నిర్మాణం ఒక కలగా పూరి గుడిసెల్లో ఉండే పరిస్థితి నుండి దశాబ్దాల కలను నెరవేర్చుటకు ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కు ఆర్థిక సహాయం చేస్తుందని ఆయన తెలిపారు. కె.సి.ఆర్ సి. ఎం.గా ఉన్నప్పుడు అప్పటి వరకు 64 సంవత్సరాలలో 22 మంది సి. ఎం.లు పని చేశారని తెలిపారు.గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఏడు లక్షల 30000 కోట్ల అప్పు చేసిందని ఈ అప్పు తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు 6500 కోట్ల చొప్పున వడ్డీ కడుతుందని తెలిపారు 10 సంవత్సరాల్లో 8 లక్షల కోట్ల అప్పు చేసి రెండు పడక గదులు ఇవ్వలేదని తన నియోజకవర్గంలో కేవలం 1400 ఇండ్లు మంజూరు చేశారని ఏడుసార్లు టెండర్ లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరు లక్ష రూపాయల నష్టం వస్తుందని ముందుకు రాలేదని తెలిపారు.వందలాదిమంది అమరల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కుటుంబ పాలన అప్పులతో ప్రజా సమస్యలు పేరుకుపోయాయని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రుణమాఫీ రైతు భరోసా సన్న బియ్యం పంపిణీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని ప్రజలు బతుకులు బాగుపడాలని సుఖంగా సంతోషంగా ఉండాలని ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.రాష్ట్ర పశు సంవర్థక,డైరీ అబివృద్ధి,మత్స్య, క్రీడలు యువజన శాఖ మంత్రి లివాకిటి శ్రీహరిలి మాట్లాడుతూ పేదవాడికి ఇల్లు ఇవ్వాలని 22,500 కోట్ల రూ.లు బడ్జెట్ లో కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 50 వేల ఇళ్లను నిర్మించాలని ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరున మంజూరు చేస్తుందన తెలిపారు. నియోజకవర్గానికి 3500 చొప్పున 175 కోట్లతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేస్తుందని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కాగితాలు చూపిస్తారని,ఇండ్లు నిర్మాణం చేస్తే అప్పులు చేయాల్సి ఉంటుందని ప్రచారం జరిగిందని తెలిపారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇంటి నిర్మాణంకు ఆర్థిక సహాయం చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం వచ్చాక రైతులకు రుణమాఫీ సన్నబియ్యం, రైతు భరోసా 200 యూనిట్ల ఉచిత కరెంటు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మహిళలకు ఆర్.టి.సి. బస్సులలో ఉచిత ప్రయాణం తదితర పథకాల అమలు చేస్తుందని తెలిపారు.కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని సంకల్పం తో సి. ఎం.మహిళా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. 72 సంవత్సరాల తర్వాత పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి రాష్ట్ర సి.ఎం అయ్యారని, సీ.ఎం నేతృత్వంలో జిల్లా సస్య శ్యామలం కావాలని ఆయన ఆకాక్షించారు . ప్రతి నియోజకవర్గంలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తోందని తెలిపారు. క్రీడలు యువజన శాఖ మంత్రిగా కొత్తకోట, దేవరకద్ర లో ఆట స్థలాన్ని మంజూరు చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.దేవరకద్ర శాసన సభ్యులు జి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేస్తూ మాట నిలబెట్టుకుందని తెలిపారు ప్రతి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొందని ఆయన తెలిపారు మూసాపేట మండల కేంద్రంలో 94 ఇల్లు మంజూరు కాగా 42 పూర్తి కావచ్చాయని అందులో ఈరోజు గృహ ప్రవేశం చేసుకున్నట్లు తెలిపారు.నియోజకవర్గం లో 3500 ఇండ్లు మంజూరు కాగా అందులో 1922 ఇండ్లు గ్రౌండ్ అయినాయని మూడు,నాలుగు నెలలలో పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. మొదటి విడత ఇందిరమ్మ ఇల్లు మంజూరు కకాని వారికి రెండో విడత 1000 ఇండ్లు మంజూరు చేయాలని ఆయన మంత్రికి విజ్ఞప్తి చేశారు .అలాగే బేస్మెంట్ వరకు వేసుకున్న వారికి సీఎంతో మాట్లాడి ఇంటి నిర్మాణానికి సహకారం అందించాలని మంత్రిని కోరారు.కొత్తకోట, దేవరకద్రలో సబ్ రిజిస్టార్ కార్యాలయాలు మంజూరు చేయాలని, కొత్తకోటను రెవెన్యూ డివిజన్ చేయాలని కోరారు మూసాపేట్,కౌకుంట్ల, అడ్డాకుల,మధనాపురం లలో మండల కాంప్లెక్స్ మంజూరు చేయాలని కోరుట్ల మదనాపురం అడ్డాకులలో కూడా మండల కాంప్లెక్స్ మంజూరు చేయాలని కోరారు అదే దేవరకథలు కూడా ఏర్పాటు చేయాలని కోరారు.జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం కార్యక్రమంలో మంత్రులు పాల్గొని గృహ ప్రవేశం చేయడం సంతోషకరం అన్నారు. రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడి 18 నెలల కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని, రైతులకు మహిళలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. జిల్లాలో 10507 ఇండ్లను మంజూరు చేయగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు చొప్పున మంజూరు చేసినట్లు అందులో 6,829 ఇండ్లు మొదలుపెట్టడం జరిగిందని త్వరలో మిగిలినవి కూడా మొదలుపెడతామని తెలిపారు. 3130 వివిధ దశలలో నిర్మాణం బట్టి చెల్లింపులు జరిగినట్లు ఈ సందర్భంగా తెలిపారు జిల్లాలో భూభారతి చట్టం అమలు చేస్తున్నట్లు137 మంది జి.పి.ఓ లను నియమించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, గృహ నిర్మాణ శాఖ పి.డి. వైద్యం భాస్కర్, డి ఆర్ డి ఓ నరసింహులు, మండల ప్రత్యేక అధికారి ఇందిర,ఆర్.డి.ఓ నవీన్,స్థానిక నాయకులు, అధికారులు,తదితరులు పాల్గొన్నారు