కమ్యూనిటీ రేడియో సేవలను మరింత ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

న్యూఢిల్లీ: దేశంలో కమ్యూనిటీ రేడియో సేవలను(సీఆర్‌ఎన్‌) మరింతగా ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి సేవలపై స్పెక్ట్రం రుసుమును రద్దు చేయాలని నిర్ణయించినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. సామాన్య ప్రజానీకానికి సమాచారం అందజేస్తూ వారి ప్రగతికి దోహదపడుతున్న కమ్యూనిటీ రేడియో సేవలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో కమ్యూనిటీ రేడియోలు స్పెక్టంను ఉచితంగా పొందవచ్చు.