కరెంటు షాక్‌తో విద్యార్థి మృతి

మెదక్‌ : జిల్లాలోని దౌల్తాబాద్‌ మండలం అనాజ్‌పూర్‌లో కరెంట్‌ షాక్‌ తగిలి విద్యార్థి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఉదయం కర్రెల పోచయ్య (18) అనే డీగ్రీ విద్యార్థి గ్రామంలో జరుగుతున్న పెండ్లికి హాజరయ్యాడు. పెండ్లి పనుల్లో భాగంగీ నీళ్లు మోస్తున్న పోచయ్య బిందెకు కరెంటు వైరు తగిలింది. దీంతో కరెంట్‌ షాక్‌ తగిలి అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.