కర్నాటకలో సదానంద వర్గం లోల్లీ

కర్నాటక: రాష్ట్రంలోని అంతర్గత కుమ్ములాటలతో అసమ్మతి నెలకొనటంతో ఆ పార్టీ అధిష్టానం నాయకత్వ మార్పు చేసింది. ముఖ్యమంత్రి పదవికి ఈరోజు సదానందగౌడ రాజీనామా చేశాడు. జగదీష్‌ షెట్టర్‌కు పగ్గాలు అప్ప జేప్పనున్నారు. ఈ నెల పదిన ఆ పార్టీ శాసనసభ పక్షం సమావేశం కానుంది. ఈ సమావేశంలో జగదీష్‌ షెట్టర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. అయితే సదానందగౌడ వర్గం నేతలు మరో వివాదానికి తెర తీశారు. ముఖ్యమంత్రి పదవి మీరు తీసుకుంటున్నప్పుడు మాకు మంత్రి పదవులు ఎక్కువ ఇవ్వాలని అంటుంది. అసమ్మతి గొడవ తోలగిందని అనుకుంటున్న సమయంలో అధిష్టానానికి మరో తలనొప్పి మొదలయింది.