కర్నూలు జిల్లాలో విద్యుత్‌ శాఖ సిబ్బంది మూకుమ్మడి సెలవు

కర్నూలు: కర్నూలు జిల్లాలో విద్యుత్‌ శాఖ ఏడీఈ, ఏఈలు మూకుమ్మడి సెలవులు పెట్టారు. ఏఈపై ఉద్యోగి దాడి వ్యవహారంలో చర్యలు తీసుకోలేదంటూ వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ సెల్‌ఫోన్లను ప్రభుత్వానికి అప్పగించి సెలవుపై వెళ్లారు. ముకుమ్మడి సెలవు పెట్టిన 120 మంది ఏడీఈలు, 60 మంది ఏఈలు.