కలుషిత నీటితో 46 మందికి అస్వస్థత

కర్ణాటక: ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక సరిహద్దు గ్రామమైన పావగడలో కలుషితమైన నీరుతాగి 46 మంది విద్యార్థినులు అస్వస్థత  పాలయ్యారు. ఇక్కడి కస్తూర్బా పాఠశాలలో చదువుతున్న బాలికలు కలుషిత నీరు తాగటంతో వారికి వాంతులు. విరేచనాలు అయ్యాయి. చికిత్సకోసం వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.