కలెక్టరేట్‌ ఎదుట 104 సిబ్బంది ధర్నా

విజయనగరం, జూలై 30 : గత నాలుగు నెలలుగా బకాయి ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 104 ఆరోగ్య సేవల సిబ్బంది సోమవారం ఇక్కడి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సిబ్బంది ఈ ధర్నాలో పాల్గొని సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తమ ఆందోళన విషయంలో వెంటనే స్పందించాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి శ్రీనివాస్‌, హేమసుందర్‌ తదితరుల నాయకత్వం వహించారు