కల్తీ కల్లు బాధితులకు తప్పిన ప్రాణాపాయం

హైదరాబాద్‌: కల్తీ కల్లు బాధితుల్లో ఎవరికీ ప్రాణాపాయం లేదని ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ ఎం.ఎం. ఫారుఖీ అన్నారు. కల్తీ కల్లు బాధితులు చికిత్స పొందుతున్న ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయాన్ని ఆయన ఈరోజు సందర్శించారు. 75 మంది బాధితుల్లో 15 మంది ఇప్పటికే ఇళ్లకు వెళ్లిపోయారని, మిగితావారికి అవసరమైన వైద్య సాయం అందిస్తున్నారని ఆయన చెప్పారు.కల్తీ కల్లులో కలిపిన మత్తుపదార్థాల వల్లే వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తాయని పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారని వివరించారు.