కళారంగంలో ప్రత్యేకత నిలుపుకొన్నారు: చిరంజీవి

హైదరాబాద్‌: కళారంగంలో సుమన్‌ తనకంటూ ఓ ప్రత్యేకతను నిలపుకొన్నారని చిరంజీవి అన్నారు. చిన్నవయసులోనే సుమన్‌ కాలం చేయడం జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. అనార్యోగంతో కన్నుమూసిన ప్రముఖ రచయిత, దర్శకుడు నటుడు సుమన్‌ భౌతిక కాయానికి ఆయన నివాళులర్పించారు. రామోజీరావు, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.