కళ్యాణలక్ష్మి పథకం పేదలకు వరం
గుడిహత్నూర్: మార్చ్8 (జనం సాక్షి)… కళ్యాణ లక్ష్మి పథకం పేద ప్రజలకు వరం లాంటిదని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు మంజూరైన 43 కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో
మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారని అన్నారు. తల్లిదండ్రులు ఆడబిడ్డల పెళ్లి కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారి కష్టాలను తెలుసుకొని కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంతో పెళ్లిళ్లకు అండగా ఉంటూ పేద వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఘనత బీఆర్ఎస్ కు దక్కిందన్నారు. పేద ప్రజల కోసం రైతు బంధు రైతు భీమా, ఆసరా పింఛన్లు, మిషన్ భగీరథ మిషన్ కాకతీయ వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచులు జాదవ్ సునీత, తిరుమల్ గౌడ్, సోయం దస్రు,మాడావి ధనలక్ష్మి, ఎంపీటీసీలు సాగిర్ ఖాన్, కేంద్రే న్యాను, బీఆర్ఎస్
, సంతోష్ గౌడ్, పాటిల్ రాందాస