కవాతు వేదికవైపు టియర్‌గ్యాస్‌ ప్రయోగం

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌ వేదికపైకి బాష్పవాయుగోళాలను పోలీసులు ప్రయోగించి రాక్షసానందం పొందుతున్నారు. టియర్‌గ్యాస్‌ వాయువు ఉక్కరి బిక్కిరి చేస్తున్నా, పైనుంచి భారీ వర్షం పడుతున్నా వాటర్‌ కేనన్లు ప్రయోగించి పోలీసులు చెదరగొట్టేందుకు ప్రయత్నించినా తెలంగాణవాదులు మొక్కవోని దీక్షతో మార్చ్‌ ప్రాంగణాన్ని వదిలిపోవడం లేదు. పోలీసులు బాష్పవాయువు గోళాలు ప్రయోగాన్ని కొనసాగిస్తుండటంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.