కేసీఆర్‌దే తుది నిర్ణయం: వినోద్‌

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ తటస్థంగా ఉండే అవకాశం ఉందని తాను భావిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర సమితి నేత వినోద్‌ తెలిపారు. 2008లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లోనూ తటస్థలంగా ఉన్నామని అదే నిర్ణయాన్ని అమలు చేయవచ్చని అన్నారు. అయితే ఇప్పటి వరకు ఈ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని, పార్టీ అధినేత కేసీఆర్‌ తుది నిర్ణయాన్ని ప్రకటిస్తారని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ను బలపర్చాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయాన్ని వినోద్‌ తప్పుపట్టారు. బేరసారాలు కుదిరినందునే ఈ నిర్ణయాన్ని జగన్‌ పార్టీ తీసుకుని ఉంటుందని అన్నారు. ప్రణబ్‌కు ఓటు చేయడం వల్ల త్వరలోనే జగన్‌కు బెయిల్‌ వస్తుందని వినోద్‌ జోస్యం చెప్పారు.