కాంగ్రెస్‌కు దడపుడుతోంది: ఎమ్మెల్సీ
హైదరాబాద్,ఆగస్ట్16(జనం సాక్షి): జలయజ్ఞం పేరిట వైఎస్ చేపట్టిన ధనయజ్ఞంలో కవిూషన్లు తీసుకున్న కాంగ్రెస్ నాయకులకు ఇవాళ టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే కానరావడం లేదని ఎమ్మెల్సీ బి.వెంకటేశ్వర్లు విమర్శించారు. ఆనాటి కమిషన్ల వ్యవహారం గురిగించి ప్రపంచమంతా కోడై కూసిందన్న విషయం మరచి పోరాదన్నారు. నేడు టీఆర్‌ఎస్ చేపట్టిన ప్రాజెక్టుల రీడిజైన్‌ను రాహుల్ విమర్శించడం విడ్డూరంగా ఉందని అన్నారు. దీనిపై రాహుల్‌గాంధీకి తప్పుడు స్క్రిప్ట్ ఇచ్చి నీతులు చెప్పిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే రీడిజైన్‌పై చర్చకు రావాలని సవాలు విసిరారు. గతంలో సిఎం ఎసిఆర్ అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే నోళ్లు వెల్లబెట్టిన నేతలు డుమ్మాకొట్టారని అన్నారు. కాళేశ్వరం పూర్తియితే ఎక్కడ తమకు పుట్టగతులు ఉండవో అన్న బెంగ కాంగ్రెస్ నేతలను వేధిస్తోందని అన్నారు.రీడిజైన్ ప్రాజెక్టులంటూ విమర్శిస్తే ప్రజలు క్షమించరని చెప్పారు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అవసరమైన దుమ్ముగూడెం ప్రాజెక్టును కాంగ్రెస్ హయాంలో కవిూషన్లకు కక్కుర్తి పడి రాజీవ్, ఇందిరాసాగర్‌గా చీల్చారని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. కేవలం మోటార్లు, పైపులు కొనుగోలు చేసి సొమ్ములు కాజేశారని, ఎక్కడా మోటార్లు పెట్టలేదన్నారు. ఇందిరాసాగర్, రుద్రంకోట ప్రాజెక్టు నిర్మిత ప్రదేశం ఆంధ్ర పరిధిలోకి వెళ్లిందని, అక్కడ హెడ్‌వర్క్స్ పైపులైన్ నిర్మించాలంటే ఆ రాష్ట్ర అనుమతి అవసరం తప్పనిసరి అని చెప్పారు. ఈ పరిస్థితిని గ్రహించే సీఎం కేసీఆర్ దుమ్ముగూడెం రీడిజైన్ చేయించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని తెలిపారు. ప్రస్తుతం అన్ని పంపుహౌస్ పనులూ చురుగ్గా సాగుతున్నాయని, అనుమతులు కూడా వస్తున్నాయని వెల్లడించారు.



