కాంగ్రెస్‌ కోర్‌కమిటీ భేటీ ప్రారంభం

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం గురువారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని ప్రతిపాదించాలనే విషయంపైనే ప్రధానంగా చర్చ సాగుతోంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాందీ, కేంద్రమంత్రులు ప్రణబ్‌ముఖర్జీ, ఆంటోనీ తోపాటు పలువురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ భేటీ కోసం సాయంత్రానికల్లా రాజధానికి చేరుకోవాలని ఆయా రాష్ట్రాల్లోని కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రులకు పార్టీ అధిష్టానం ఆదేశించింది. అధిష్టానం పిలుపు మేరకు పలువురు ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్లారు.