కాంగ్రెస్‌, తెదేపా శ్రేణుల మధ్య ఘర్షణ ఒకరి మృతి

విజయనగరం: గరివిడి మండలం బీజే పాలెంలో కాంగ్రెస్‌, తెదేపా శ్రేణులు ఘర్షణకు దిగాయి. కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని ఆదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.