కాంగ్రెస్‌ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభం

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ విస్తృత స్థాయి సమావేశం ఎల్బీ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఆజాద్‌, ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి, పీసీసీ అధినేత బొత్సతోపాటు రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ముఖ్యనేతలంతా హాజరయ్యారు. సాధారణ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయడం.. అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలాంటి అంశాలపై నేతలు మేధోమథనం చేయనున్నారు.