కాంగ్రెస్‌ వైకాపా నాణానికి బొమ్మబోరుసులు:బీజేపీ

హైదరాబాద్‌: కాంగ్రెస్‌, వైకాపా నాణానికి బొమ్మబొరుసులని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఆ రెండు పార్టీలు ఒకటేనని గ్రూపు తగాదాలతో విడిపోయారని ఆయన అన్నారు. అందుకే రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌కి ఓటు వేశారని ఆయన అన్నారు. తెలుగుదేశంపార్టీ ఎన్నికకు దూరంగా ఉండటాన్ని తప్పు బట్టారు. సంగ్మా భాజపా అభ్యర్థి కాదని స్వతంత్రంగా పోటీ చేస్తున్నారని చెప్పారు. భాజపా మతతత్వ పార్టీ అయితే తమతో కలసి అసెంబ్లీ కూర్చున్న చంద్రబాబు మతతత్వవాది కూడా అని అన్నారు.