కాకతీయ ఉత్సవాలపై చేతులెతైసిన సర్కారు

 

వరంగల్‌: నవంబర్‌ 15, (జనంసాక్షి):

కాకలీయ ఉత్సవాలపై సీమాంధ్ర ప్రభుత్వం చేతులెత్తేసింది ఈఉత్సవాలను డిసెంబర్‌ 21కి రాష్ట్ర ప్రభుత్వ వాయిదా వేసింది రూ25 లక్షలతో ఉత్సవాలు జరలేమని జిల్లా యంత్రాంగం చేతులెత్తేయడంతో ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుంది కనీసం రూ.160 కోట్ల నిధులు ఇవ్వాలని జిల్లా యంత్రాంగం ప్రతిపాదన పంపింది నిధుల విడుదలలో జాప్యం అనివార్యం అయినందున కాకతీయ ఉత్సవాలు ప్రభుత్వం వాయిదా వేసింది కాకతీయ ఉత్సవాలను ఏడాది పాటు నిర్వ:హించాలని రూ,150కోట్ల విడుదల చేయాలని టీఆర్‌ఎస్‌ పార్టి ఇప్పటికి డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే రాయల ఉత్సవాలకు రూ.150. కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో జరిగే కాకతీయ ఉత్సవాలకు 25కోట్లువిడుదల చేయడం వివక్షకాక ఏమవుతుంది జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టి అధ్యక్షుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రశ్నించారు గత 60 ఏండ్లగా ఈసీమాంధ్ర ప్రభుత్వ పాలనులో తెలంగాణ ప్రజలకు జరుగుతున్న వివక్షకు ఇదొక ఉదాహారణ అని ఆయన వ్యాఖ్యనించారు తెలంగాణ వ్యాప్తంగా సీమాంధ్ర ప్రభుత్వం దోరణని ఎండగతామని ఆయన చెప్పారు

 

వ్యక్తులు కాదు వ్యవస్థలు ముఖ్యం బొత్స

హైదరాబాద్‌ : నవంబర్‌ 15, (జనంసాక్షి):

ఎవరిపైనో కోపంతోనో సమన్వయ లోపంతోనో కాంగ్రెస్‌ పార్టీకి ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకోవడం సరైంది కాదని వ్యక్తులు కన్నా వ్యవస్థలు ముఖ్యమని పీసీసీ అధ్యక్షడు బొత్స సత్యనారాయణ అన్నారు ఆయన బుధవారం సాయంత్రం గాంధీభవన్‌లో మాట్లాడుతూ సంఘపరివార్‌కు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం సహకరించినట్టు ఆరోపించి ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకోవడం శోచనీయమన్నారు ముస్లింలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరించిదని మజ్లిస్‌ ఆరోపించడం బాధాకరమని అన్నారు మైనారిటీలకు అండగ నిలబడేది కాంగ్రెస్‌ పార్టీనేనని ఆయరస్పష్టం చేశారు మతతత్వశక్తులతో కాంగ్రెస్‌ కుమ్మకైందా అని బొత్స ప్రశ్నించారు , భాగ్యలక్ష్మి టెంపుల్‌ వ్యవహారం సున్నితమైందన్నారు ఈవిషయం హైకోర్టు ఇచ్చిన సూచనలనే అధికారులు పాటిస్తున్నారని పేర్కొన్నారు