కాకి కోకిల ఒకటి కాదు

.జనంసాక్షి. సెప్టెంబర్ 19.
మనుషుల్లో ఇద్దరు ఒకటే ఉన్నా పోలికల్లో ఒకే రకంగా ఉన్న
మనుషులు మాత్రం మనసుల్లో బ్రహ్మాండమైన తేడా ఉంటుంది
నేడు మనిషి స్వార్థపు వలయంలో చిక్కుకొని తనే ఘనుడు అనుకుంటున్నాడు
విలాసాల లోగిలిలో మైమరిచిపోతున్నారు
మంచిని ఎప్పుడూ తుంగలో తొక్కారు
తూర్పున ఉదయించే సూర్యోదయాన్
ఆపాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు
అయినా అతని ప్రయత్నాలన్నీ సూర్యుని ముందు దిగదుడు పై
మానవ ప్రయత్నాన్ని వంచనకు గురవుతున్నారు మనిషిని మనిషి గుర్తించడం లేదు
జీవన విలువలకు తిలోదకాలు
మనిషి నిరంతరం ఏదో ఆరాటపడుతున్నాడు చివరికి ఎండమావులు లాంటి జీవితంలో
నిన్ను కదిలించినా కదిలించబోయే ప్రతి అక్షరానికి జేజేలు పలుకు
ఖమ్మం భువనగిరి కోట సిహెచ్ ఆంజనేయులు 7702537453