కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి నోటీఫికేషన్ విడుదల
హైదరాబాద్: రాష్ట్రంలో 6,071 పోలీసు కానిస్టేబుళ్ల భర్తీకి రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, అగ్నిమాపక విభాగాల్లో ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.