కారు అదుపు తప్పి పయ్యవుల కేశవ్‌కు స్వల్పగాయాలు

 

అనంతపురం: కూడేరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యవుల కేశవ్‌ స్వల్పంగా గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి విద్యుత్‌ స్తంబాన్ని ఢీకొనటంతో ఈ ప్రమాదం సంభవించింది.