కారు ఢీ కొని వ్యక్తి మృతి

కందుకూరు : కారు ఢికొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా కందుకూరు మండలం ఓగూరు గ్రామంలో చోటుచేసుకొంది. లింగసముద్రం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు రహదారిపై నడుచుకుంటూ వస్తున్న ఓగూరు గ్రామానికి చెందిన అల్లం కోటేశ్వరరావును (55) ను ఢీ కొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం కారు పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీ కొట్టడంతో అందులో ఉన్న మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.