కార్పొరేట్‌ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లు

శ్రీకాకుళం: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాటమంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో మాట్లాడుతూ కార్పొరేట్‌ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఫలితాలు మెరుగు పరుస్తామని తెలిపారు. రెండేళ్లలో ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల రూపు రేఖలను సమూలంగా మారుస్తామని హామీ ఇచ్చారు.