కార్మికుల సమస్యలపౌ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా: హరీష్‌రావు

హైదరాబాద్‌: కార్మికుల అభుయన్నతి కోసం సమర్ధమైన చట్టాలు ఉన్నా వాటిని అమలు చేయటంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని తెరాస ఎమ్మెల్యే టి.హరీష్‌రావు విమర్శించారు. విద్యుత్తు శాఖలో పనిచేస్తున్న కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాన విద్యుత్తు కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆవిర్భావ సభ పోస్టర్‌ను ఆయన హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ నెల 21వ తేదీన మింట్‌కాంపౌండ్‌లో జరిగే ఆవిర్భావ సభలో కార్మికుల సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.