కార్మిక హక్కుల సాధనకై సీఐటీయూ నిరంతర పోరు

 – సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లిఖార్జున్
ఫొటో ఉంది
హత్నూర (జనం సాక్షి)
కార్మిక హక్కుల సాధనకై పారిశ్రామిక వర్గాలతో సీఐటీయూ నిరంతరం పోరాటం చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లిఖార్జున్ అన్నారు.మండలం పరిధిలోని కాసాల గ్రామ శివారులో గల సుగుణ ఫుడ్స్ పరిశ్రమ వద్ద గురువారం కార్మికులతో గెట్ మీటింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు ఎల్లవేళలా సీఐటీయూ అందుబాటులో ఉంటుందని వారు పేర్కొన్నారు.రేపు 3వ తేదిన జరగబోయే గుర్తింపు ఎన్నికలో కార్మికులంతా ఏకమై సీఐటీయూ ను గెలిపించాలని వారు కోరారు.ఓ వైపు బిజెపి కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తూ పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ వేస్తుంటే మరోవైపు దాని అనుబంధ సంఘమైన బిఎమ్ఎస్ కార్మికుల పక్షాన నిలబడి ఎలా పోరాటం చేస్తుందని వారన్నారు.కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తూ అనునిత్యం కార్మికులకు అండగా నిలబడుతున్న సీఐటీయూ ను భారీ మెజారిటీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో సీఐటీయూ సుగుణ ఫుడ్స్ పరిశ్రమ యూనియన్ అధ్యక్షుడు ఎ.మల్లేశం, మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు కడారి నాగరాజు, నాయకులు శేఖర్,సాయిలు,షబ్బీర్,గోపాల్,సాంబాజీ, ఫారహత్,కేశవ్ తదితరులు పాల్గొన్నారు.