కార్యకర్తల మద్దతే పార్టీకి శ్రీరామరక్ష:టీడీపీ అధినేత చంద్రబాబు

 

అనంతపురం: 13వ రోజు పాదయాత్రను గుంతకల్లులో ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ పార్టీలో ఒకరిద్దరు నాయకులు తప్పుడు పనులు చేసినా కార్యకర్తలు మాత్రం పార్టీని వీడలేదన్నారు. పాదయాత్రలో చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె పార్టీ కార్యకర్తలు చంద్రబాబును కలిశారు. కుప్పం నియోజకవర్గంతో సమానంగా తంబళ్లపల్లెను అభివృద్ది చేస్తానని వారికి హామి ఇచ్చారు.