కాలిపోతున్న నల్లబంగారం..!

గనులవద్ద పేరుకుపోయిన బొగ్గునిల్వలు…
కాకతీయఖని, జూన్‌ 17, (జనంసాక్షి) :
నల్లబంగారం కాలి బూడిదవుతున్నది. అధికారుల సాక్షిగా బొగ్గులోనుంచి పొగలు వెలువడుతున్న ప్పటికి పట్టించుకున్న దాఖలాలులేవు గత ఆరు రోజులుగా కాంటాకూలీలు ట్రాన్స్‌పోర్టు యజమా నులమద్య విబేదాలు పొడచూపటంతో బొగ్గురవా ణాకు ఆటంకం ఏర్పడింది. దీంతో గనులవద్ద బొగ్గునిల్వలు పేరుకుపోయాయి. సమస్యను పరి ష్కరించడంలో సింగరేణి అధికారులు చొరవచూ పకపోవడంతో బావులనుండి వెలికి తీసిన బొగ్గు ను యార్డులల్లో నుంచి లారీలల్లో తీసుకపోవడం లేక బొగ్గునిల్వలు పేరుకుపోయాయి. బొగ్గును నేలపై ఉంచడం మూలంగా నాణ్యత కోల్పోయే ప్రమాదం ఉంది. కాని అధికారులు మాత్రం ఈ విషయమై అంతగా పట్టించుకోవడంలేదు. వేసవి కాలంవల్ల వేడిమికి నిల్వఉన్నబొగ్గు అంటుకొని కాలిబూడిదైపోతుంది. రోజు అండర్‌గ్రౌండ్‌గనుల నుంచి సూమారు 4వేలకుపైగా టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుంది ఈలెక్కన ఆరురోజుల్లో సూ మారు 25వేల టన్నులకుపైగా బొగ్గు గని ఆవర ణలో గుట్టలుగుట్టలుగా పేరుకుపోయాయి. ఈ క్రమంలో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ బొగ్గు నాణ్యత పూర్తిగా కోల్పోతున్నది. అదేవిధంగా నిల్వఉన్నబొగ్గును రవాణాచేయడం వల్ల సంస్థకు ఆర్థికంగా నష్టం జరిగేఅవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నిల్వఉన్నబొగ్గును డోజర్‌ ద్వారా ప్రత్యేకంగా లారీల్లో నింపాల్సిఉంటుంది. అప్పటికే బొగ్గునాణ్యత కోల్పోవడమే కాకుండా మట్టిసైతం కలవడంతో వినియోగదారులు నష్ట పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అధికారులు చొరవతీసుకొని బొగ్గునుత్వరితగతిన రవాణా చేయాల్సినఅవసరం ఎంతైనా ఉన్నది.