కాల్‌లిస్ట్‌ వ్యవహారంపై జేడీ ఫిర్యాదు

హైదరాబాద్‌: ఫోన్‌కాల్‌ లిస్టు వ్యవహారంపై సీబీఐ జేడీ లక్ష్మినారాయణ నగర పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ కేసును నగర్‌ సీసీఎస్‌ విభాగానికి పంపినట్టు నగర పోలీసు కమిషనర్‌ అనురాగ్‌ శర్మ తెలియజేశారు. అదే విధంగా చంద్రబాల ఫోన్‌కాల్‌ జాబితా వెల్లడిపై సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్షిపత్రిక సీనియర్‌ రిపోర్టర్‌ యాదగిరి రెడ్డి, నాచారం సీఐ శ్రీనివాస్‌రావులపై సైబరాబాద్‌  పోలీసులు కేసు నమోదుచేశారు. ఇండియాన్‌ టెలిగ్రాఫ్‌ చట్టంలోని  24,25,29 సెక్షన్లతో పాటు అధికార రహస్యాల చట్టంలోని సెక్షన్‌ 72, ఐటీ యాక్గులోని 66 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలియజేశారు.