కాల్‌లిస్ట్‌ వ్యవహారం పై జేడీ ఫిర్యాదు

హైదరాబాద్‌: ఫోన్‌ లిస్టు వ్యవహారంపై సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును నగర్‌ సీసీఎన్‌ విభాగానికి పంపినట్టు నగర పోలీసు కమిషనర్‌ అనురాగ్‌ శర్మ తెలిపారు. అదే విధంగా చంద్రబాల ఫోన్‌ కాల్‌ జాబితా వెల్లడి పై సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్షిపత్రిక సీనియర్‌ రిపోర్టర్‌ యాదగిరిరెడ్డి, నాచారం సీఐ శ్రీనివాసరావులపై సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.