కావాతులకు ప్రభుత్వం సానుకూలత ప్రకటన

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డులో తెలంగాణ కవాతుకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తంచేసినట్లు సమాచారం. మధ్యాహ్నం మూడున్నర గంటలనుంచి రాత్రి 7 గంటలవరకు కవాతుకు అనుమతించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాసేపట్లో ప్రభుత్వ ప్రకటన వెలువడనుంది. కవాతు వేదిక, అనుమతి విషయమై ఈరోజు సాయంత్రం నుంచి రాష్ట్ర మంత్రులకు, తెలంగాన నేతలకు మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ట్యాంక్‌ బండ్‌పైనే కవాతుకు తొలుత తెలంగాణ నేతలు పట్టుపట్టగా ఘట్‌కేసర్‌ లేదా పరేడ్‌ మైదానంలో కవాతుకు అనుమతిస్తామని సీఎం సూచించారు. అబిడ్స్‌నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు కవాతును అనుమతి ఇవ్వాలని ఐకాస నేలతు కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కవాతు నిర్వహిస్తామని ఐకాస నేతలను ప్రభుత్వం రాతపూర్వక హామీ కోరింది. ట్యాకుబండ్‌పై కవాతుకు అనుమతిస్తే హామీ ఇస్తామని ఐకాస నేతలు పేర్కొన్నారు.