కింగ్‌ఫిషర్‌ ఉద్యోగులతో రేపు మరోసారి చర్చలు

న్యూఢిల్లీ: కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌లో సంక్షోభం కొనసాగుతోంది, జీతాల కోసం సమ్మెకు దిగిన ఉద్యోగులతో మరోసారి యాజమాన్యం చర్చలకు సిద్థమైంది, సమస్యల  పరిష్కారం కోసం ముంబయిలో రేపు జరిగే చర్చలకు హాజరుకావాలరి ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో సంస్థ ఈ నెల 20 వరకూ లాకౌట్‌ను ప్రకటించి అన్ని విమాన సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు పలు దఫాలుగా యాజమాన్యం చర్చలు జరుపుతున్నప్పటికీ.. మొత్తం జీతాలు చేతికందేవరకూ విధులకు హాజరయ్యేది లేదని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు.