కిరణ్‌కుమార్‌రెడ్డికి సీపీఐ నారాయణ లేఖ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ లేఖ రాశారు. కృష్ణా డెల్టాకు సాగర్‌ నీటి విడుదలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని లేఖలో పేర్కొన్నారు. కృష్ణా డెల్టాకు 15 టీఎంసీల  నీటిని విడుదల చేయాలని సీఎం శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.