కిరణ్‌ నాయకత్వాన్ని బలపరచాలి:వెంకట్రావు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వాన్ని బలపర్చాల్సిన అవసరం వుందని కాంగ్రెస్‌ సీనియర్‌నేత  పాలడుగు వెంకట్రావు అన్నారు. కిరణ్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఇబ్బందుల్లో ఉన్నారని అయితే వాటిని అధిగిమించి మంచి నాయకునిగా ఎదిగారన్నారు. కేంద్రమంత్రివర్గంలో చేరాలని రాహుల్‌గాంధీని కోరగా ఆయన నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు.