కిలా వరంగల్ లో మహిళా దినోత్సవ వేడుకలు
వరంగల్ ఈస్ట్ మార్చి 9 (జనం సాక్షి)
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కిలా వరంగల్ అంబేద్కర్ భవన్లో ఎండి నాహీద్ అధ్యక్షతన అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం కిలా వరంగల్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సదస్సులో అధ్యక్షులు ఎండినాహిద్ మాట్లాడుతూ మిషన్ కుట్టే కార్మికులకు సమాన వేతనాలు లేవని వందల ఏళ్లుగా మహిళలు పోరాడుతున్న ప్రభుత్వాలు అమలు చేయడం లేదన్నారు సమాన వేతనాలు సాధించేంతవరకు మహిళలు పోరాడాలని పిలుపునిచ్చారు ఈ సదస్సులో 5వ వరంగల్ జిల్లా కార్యదర్శి రత్నమాల నలిగంటి మాట్లాడుతూ మహిళలు గనుల్లో వనరుల్లో కార్ఖానాల్లో ఇటుక బట్టీల్లో బిల్డింగ్ బీడీ అంగన్వాడి ఆశ మిషన్ కార్మికులుగా అతి తక్కువ వేతనాలకు శ్రమిస్తున్నారన్నారు వారి శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వక దోపిడీకి గురి అవుతున్నారని అన్నారు అన్ని రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు శ్రమకు తగ్గ వేతనం సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను చేశారు ఈ సదస్సులో జీ ప్రేమ లత జి ప్రసన్న చిట్టెమ్మ పూల రజిత సుజాత స్నేహ తదితరులు పాల్గొన్నారు . .