కిషోర్ చంద్రదేవ్ ఆరోపణలు బాధ్యతారహితం : శత్రుచర్ల
శ్రీకాకుళం : కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ చేసినట్లు చెబుతున్న ఆరోపణలు బాధ్యతారహితమైనవని రాష్ట్ర మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు. థర్మల్ ప్రాజెక్టులో వాటాలు ఉన్నాయని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన ఆరోపణలు నిరూపణలు కాకపోతే కిషోర్ చంద్రదేవ్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు.



