కుటుంబసమేతంగా దుబాయ్ వెళ్లిన చంద్రబాబు
హైదరాబాద్: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు కుటుంబసమేతంగా ఈ రోజు దుబాయ్ బయల్దేరి వెళ్లారు. భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్ ఆయనతో ఉన్నారు. నాలుగు రోజుల పాటు దుబాయ్‌లో పర్యటించి ఈ నెల 27న వారు తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నట్లు సమాచారం.