కుట్ర పరిణామాలను బయటపెడతా
జనసేన అధికార ప్రతినిధి శ్రీధర్ వెల్లడి
హైదరాబాద్,ఏప్రిల్20(జనంసాక్షి): గత నెలరోజులుగా సినీ ఇండస్ట్రీలో తెలుగు రాష్టాల్ల్రో నెలకొన్న
పరిణామాలపై జనసేన అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ విూడియాతో మాట్లాడారు. కుట్రపూరితంగా వెనకనుంచి నడుపుతున్న వారి బాగోతాలు బట్టబయలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఫిల్మ్ చాంబర్‌లో ఆయన మాట్లాడుతూ..’ కుట్రను కచ్చితంగా బయటపెడతాం. ఇది ఇక్కడితో ఆగదు. టైం వచ్చినప్పుడు ఆధారాలన్నీ బయటపెడతాం. ప్రస్తుతం ప్రముఖులందరితో మా అధినేత పవన్ చర్చలు జరుపుతున్నారు. సినీ ఇండస్టీల్రో జరుగుతున్న వ్యవహారాలన్నింటిపైనా చర్చలు జరుగుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీని దెబ్బతీయడానికి ఇలా జరుగుతోందా?.. లేదా ఒక వ్యక్తిని దెబ్బతీయడానికి ఇలా చేస్తున్నారా?. తెలుగు రాష్టాల్ల్రో అసలేం జరుగుతోందనే దానిపై చర్చిస్తున్నారు. తెలుగు రాష్టాల్ల్రో , సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలపై పవన్ తల్లికి ఏమైనా సంబంధముందా?. అసలు ఆమెను టార్గెట్ చేయడానికి ఎవరికి హక్కుంది?. ఇవాళ పవన్ మదర్‌ను అన్నది.. రేపొద్దున ఇంకొకర్ని అంటుందని శ్రీరెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ శ్రీధర్ చెప్పుకొచ్చారు.