శ్రీకాకుళం సంఘటన పై ప్రభుత్వమే భాధ్యత వహించాలి

హైదరాబాద్‌ : కుల వివక్షను రూపుమాపడంలో ప్రభుత్వం విఫలమైందనరడానికి శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలో జరిగిన ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు విమర్శించారు.

భూతగాదాలో నలుగురు దళితులు మృతి చెందడం పై ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తూ.. కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాఘవులు ప్రభుత్వం దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. రెండేళ్లుగా ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ ను నియమించక పోవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు పరిహరంతో చేతులు దులిపేసుకోకుండా వారికి భూములు ఇవ్వాలని డిమండ్‌ చేశారు.